కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

 కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.  కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని ట్వీట్ చేశారు కేటీఆర్. దీనిపై రియాక్ట్ అయిన యెన్నం.. ప్రజాకోర్టులో గెలిచినట్టుగానే లీగల్ గా న్యాయస్థానంలోనూ గెలుస్తామన్నారు. కేటీఆర్ మళ్లీ మళ్లీ ఓడిపోక తప్పదని ట్వీట్ చేశారు యెన్నం. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణ చేసిన కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధరణ, అసత్య ఆరోపణలను చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రితో పాటు ఇద్దరు నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు కేటీఆర్. 

ALSO READ :- మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పోటీ బీజేపీతోనే: కేటీఆర్