మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం

మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం

లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి. కొన్ని షరతులతో కొన్ని ప్రాంతాల్లో వైన్ షాపులు తెరచుకున్నాయి. ఏపీలో కూడా కొన్ని షరతులతో సోమవారం మద్యం షాపులు తెరచుకున్నాయి. చాలా రోజుల తర్వాత వైన్ షాపులు తెరచుకోవడంతో జనాలు మందుకోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అయితే రాష్ట్రంలో మందును కంట్రోల్ చేయడంతో పాటు.. సోషల్ డిస్టెన్సింగ్ కూడా అమలుకావాలంటే మద్యం ధరలు పెంచడమే మార్గమని ఏపీ ప్రభుత్వం భావించింది. దానికనుగుణంగా సోమవారం షాపులు తెరవాడానికి ముందే మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మందుకోసం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్యూలో నిలబడి మరీ కొనుగోలుచేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు నేటి మధ్యాహ్నం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో పేర్కొంది. అందుకే మద్యం ధరలను పెంచుతూ మద్యాన్ని అందరికీ దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిందని భావిస్తున్నారు. మొత్తంగా లాక్డౌన్ పుణ్యమా అని ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో 15 శాతం మద్యం దుకాణాలను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎంవో కార్యలయం నుంచి సమాచారం.

For More News..

మారటోరియం మరో మూడు నెలలు పెంపు!

తమిళనాడును వణికిస్తున్న కోయంబేడు మార్కెట్

ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ బ్యాన్ చేసిన ఆపిల్, గూగుల్