
అమరావతి: లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా .. రాష్ట్రంలోనూ మే-31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తామని తెలిపింది. అలాగే ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఏపీ సర్కార్.