
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయ పాలక మండళ్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహ రాష్ట్రంలోని అన్ని ఆలయాల పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టప్రకారం ఆర్డినెన్స్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ నెల 8 తేదీన మంత్రి వర్గం ఏర్పాటు కానుండగా అదే రోజు క్యాబినెట్ లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్ . పాలక మండళ్లకు ముందస్తు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో.. క్యాబినెట్ ఆమోదంతోనే ఆర్డినెన్స్ కు రంగం సిద్ధం చేశారు. దేవాదాయశాఖ చట్టం 1987లోని సవరణ ద్వారా ఈ ఆర్డినెన్స్ ను తీసుకురానున్నారు. క్యాబినెట్ ఆమోదించిన వెంటనే గవర్నర్ కు పంపబోతున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో 12 న అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్ .