సంగమేశ్వరం డీపీఆర్​లో అన్నీ తప్పులే

సంగమేశ్వరం డీపీఆర్​లో అన్నీ తప్పులే

సంగమేశ్వరం డీపీఆర్​లో తప్పులు

ఏపీ పంపిన రిపోర్ట్​లో వివరాలేవీ లేవన్న కేంద్రం

పూర్తి ఇన్ఫర్మేషన్​తో మళ్లీ పంపాలని లెటర్​

హైదరాబాద్‌, వెలుగు: డీటైల్డ్‌  ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సరిగా రాయడం నేర్చుకోవాలని ఏపీ సర్కారుకు కేంద్రం చురకలు వేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌  తయారీపై సెంట్రల్​ వాటర్​ కమిషన్​(సీడబ్ల్యూసీ) వెబ్‌సైట్​లోని గైడ్‌ లైన్స్‌ ను ఫాలో కావాలని సూచించింది. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌  స్కీం డీపీఆర్‌  సరిగా లేదని, అన్ని వివరాలతో సమగ్ర డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని ఆదేశిస్తూ లెటర్​ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ డైరెక్టర్‌ ఎన్‌.ముఖర్జీ గురువారం ఏపీ వాటర్‌ రీసోర్సెస్‌ ఈఎన్సీకి ఈ లెటర్  పంపారు. రాయలసీమ లిఫ్ట్‌‌ స్కీం ద్వారా సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసి.. శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌, పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ పరిధిలోని ఆయకట్టుకు అందించే ప్రాజెక్టు డీపీఆర్‌‌  తమకు అందిందని కేంద్ర జలశక్తి శాఖ డైరెక్టర్​ తన లెటర్​లో పేర్కొన్నారు. ప్రాజెక్టు అప్రైజల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టం (ఇ-పీఏఎంఎస్‌‌) ద్వారా సాఫ్ట్‌‌కాపీ అందిందని, డీపీఆర్‌‌ హార్డ్‌‌ కాపీ ఈ నెల 3న తమకు చేరిందని వివరించారు. అయితే డీపీఆర్‌‌లో ఉండాల్సిన సాధారణ సమాచారమేదీ కూడా ఆ రిపోర్టులో లేదని స్పష్టం చేశారు. హైడ్రాలజీ, ఇంటర్‌‌ స్టేట్‌‌, ఇరిగేషన్‌‌ ప్లానింగ్‌‌, డిజైన్‌‌, కాస్ట్‌‌ ఎస్టిమేట్‌‌ తదితర అంశాలేవి వివరించలేదని.. ప్రాజెక్టుకు టెక్నికల్‌‌ అప్రైజల్‌‌ ఇవ్వడానికి ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు.

ముందు గైడ్​లైన్స్​ చూడండి

ఇరిగేషన్‌‌, మల్టీపర్పస్‌‌ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లను రూపొందించడానికి సీడబ్ల్యూసీ నిర్దేశిత గైడ్‌‌లైన్స్‌‌ రూపొందించిందని జలశక్తి శాఖ డైరెక్టర్​ వివరించారు. సీడబ్ల్యూసీ వెబ్‌‌సైట్లో ఆ వివరాలు ఉన్నాయని.. వాటి ఆధారంగా సమగ్ర డీపీఆర్‌‌ను తయారు చేయాలని సూచించారు. ఆ వెబ్‌‌సైట్లోని పబ్లికేషన్‌‌ విభాగంలో ఉన్న ఐటం 29తో వివరాలన్నీ సరిచూసుకుని.. పూర్తిస్థాయి డీపీఆర్​ను తమకు పంపాలని ఆదేశించారు.

ఏపీ సీఎం జగన్‌‌ కోరినా..?

ఏపీ సీఎం జగన్‌‌ బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ను కలిసి రాయలసీమ లిఫ్ట్​స్కీం డీపీఆర్‌‌ను పరిశీలించి, ఆమోదించాలని కోరారు. అయితే జగన్‌‌  కేంద్ర మంత్రిని కలిసి వెళ్లిన కొద్దిసేపటికే.. ప్రాజెక్టు డీపీఆర్‌‌ సరిగా లేదంటూ జలశక్తి శాఖ డైరెక్టర్​ ఏపీకి లెటర్​ రాశారు. ప్రాజెక్టులకు టెక్నికల్‌‌ అప్రైజల్‌‌ ఇవ్వడానికి అవసరమైన ప్రొటోకాల్‌‌  అనుసరించాల్సిందేనని.. దానికి రాజకీయ నిర్ణయాలతో సంబంధం లేదని కేంద్రమంత్రి క్లారిటీ ఇవ్వడంతోనే.. డైరెక్టర్‌‌  ఏపీకి లెటర్​ రాసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌‌  ఇటీవల కేంద్రమంత్రిని కలిసిన రోజే.. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు, కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్ల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రానికి లెటర్​ రాశారు. ఏపీ విషయంలోనూ అదే రీతిలో స్పందించారు.

For More News..

పరిహారం తేల్చకుండా పనులు కానివ్వం