ఏపీలో కుల గణన షురూ

ఏపీలో కుల గణన షురూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం నుంచి కుల గణన ప్రారంభమైంది. ఈ సర్వేను  రెండు రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకుగాను ఐదు జిల్లాల పరిధిలోని ఐదు సచివాలయాలను ఎంపిక చేసింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కులగణన సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రజల కులం, ఉపకులంతోపాటు పలు వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. 

ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ మొదలవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు పేదల సొమ్మును ఎలా దోచుకోవాలని మాత్రమే ఆలోచించాయని, సీఎం జగన్ ఒక్కరే.. పేదల సొమ్మును వారికే అందజేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారని ఆయనప్రశంసించారు.