థియేటర్లు ఓపెన్.. ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

థియేటర్లు ఓపెన్.. ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులతో మరిన్ని ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. తాజాగా సినిమా ప్రియులకు శుభవార్త చెప్పింది. థియేటర్లను రన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కేంద్రం నిర్దేశించిన కోవిడ్ మార్గదర్శకాల మేరకు సీటుకు సీటుకు మధ్య గ్యాప్ తో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చింది. 
అంతేకాదు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉభయ గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ ఆంక్షలు సడలింపులు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేయాలని ఆదేశించారు. కరోనా పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంతవరకూ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులు ఉంటాయి. దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసివేసి ఇళ్లకు చేరుకోవాలని ఆదేశించారు. 
థియేటర్లతోపాటు రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలకు అనుమతి
సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండలపాలు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చింది. అయితే అన్నిచోట్లా కోవిడ్‌ ప్రోటోకాల్ మేరకు నిర్వహించుకోవాలని ఆదేశించింది. జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరిగా ఉండాలని.. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. కోవిడ్‌ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.