విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి..

విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి..

విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం (ఆగస్టు2) విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న అంశంపై మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ (MOEF) ఇప్పటికీ నివేదిక ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ఈ నివేదికను పరిశీలిస్తే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు అనుమతిచ్చిన విస్తీర్ణం మేరకే రుషికొండలో నిర్మాణాలు పరిమితం కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఉత్తర్వులు ఇచ్చేందుకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.