ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. 12 కార్పొరేషన్లలో కూటమి లీడ్‌లో ఉండగా, వైఎస్సార్ సీపీ కేవలం (అనంతపురం) ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. 86 మున్సిపాలిటీల్లో కూటమి 74 స్థానాలు గెలుపొందగా.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో ముందంజలోఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
హైదరాబాద్, వెలుగు: ఏపీ మున్సిపల్‌ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర కొనసాగింది. 12 కార్పొరేషన్లలో కూటమి లీడ్ లో ఉండగా, వైఎస్ఆర్ సీపీ కేవలం (అనంతపురం) ఒక స్థానంతో మాత్రమే సరిపెట్టుకుని డీలా పడింది. 86 మున్సిపాలిటీల్లో ఇప్పటికే కూటమి 76 స్థానాలు గెలుపొందగా.. మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో ముందంజలోఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఇక మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలోనూ టీడీపీ జెండా రెపరెపలాడింది.
కూటమి మేయర్ అభ్యర్థులు.. తిరుపతిలో మన్నె శ్రీనివాస ప్రసాద్, చిత్తూరులో కఠారి హేమలత, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, మచిలీపట్నంలో షేక్ అబ్దుల్లా అబీదా, నెల్లూరులో రూప్ కుమార్ యాదవ్, విశాఖలో ముక్కా శ్రావణి, ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు, కర్నూలులో ప్రత్యూష ఘన విజయం సాధించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రమే వైఎస్ఆర్ సీపీ గెలుపొందింది. ఆదోనిలో జనసేన రెబల్ స్వప్న గెలుపొందారు. అంతకుముందు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కూటమి అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్‌లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 1న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
విశాఖ మేయర్‌గా శ్రావణి
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేపిన విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకుంది. టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి.. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుదు కల్యాణిపై ఘన విజయం సాధించారు. మొత్తం 120 డివిజన్లలో కూటమి అభ్యర్థులు మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంటూ మరోసారి సత్తా చాటారు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే: పవన్‌కల్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడంతో కూటమి శ్రేణులు పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా విజయం కూటమిదేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై పట్టణ, నగర ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్సార్సీపీ చీప్జగన్మండిపడ్డారు. ఇవి ఎన్నికలు కావని.. కేవలం సెలక్షన్లు మాత్రమేనని ఆరోపించారు.
