నవరత్నాలకు వినూత్న ప్రచారం .. మీ సేవలు ఎంతో మందికి ఆదర్శనీయం

నవరత్నాలకు వినూత్న ప్రచారం .. మీ సేవలు ఎంతో మందికి ఆదర్శనీయం

ప్రపంచవ్యాప్తంగా ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పర్వతారోహకుడు జి సురేష్ బాబు  ప్రచారం చేస్తున్నారు.  ఏపీ ప్రజల పట్ల మీకున్న అంకితభావం, మరియు ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమంటూ సీఎం జగన్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్దికి కంకణం కట్టుకోవడం  అభినందనీయమని  . పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం అభినందనీయం అన్నారు. నవరత్నాల పథకాల అమలు  అభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు.ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.