మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన కోసం చర్యలను చేపట్టాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ అంగన్ వాడీలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య పూర్తి సమాచారం సిద్ధం చేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలో 3 సంవత్సరాల్లోపు పిల్లల అడ్మిషన్లు పెంచాలని, వారికి రుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే చేయాలని కోరారు.
వసతి గృహాల నిర్వహణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు బారిన విద్యార్థులు పడకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డుల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదర్, ఐడీఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
