హైదరాబాద్ సిటీకి భారీ వర్ష సూచన

హైదరాబాద్ సిటీకి భారీ వర్ష సూచన

హైదరాబాద్: హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్కి భారీ వర్షంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలిక పాటి నుంచి మోస్తారు వర్షంతో పాటూ అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ (జులై 30, 2026) ఉదయం నుంచి హైదరాబాద్ సిటీని ముసురు కమ్మేసింది. ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి.

ఇప్పటికే హైదరాబాద్కి భారీ వర్షంతో GHMC మాన్సూన్ హైడ్రా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. హైదరాబాద్లో దాదాపు ఈ రోజంతా (జులై 30, 2026) ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హిమాయత్ నగర్ , అబిడ్స్, కోఠి, సైఫాబాద్, ట్యాంక్ బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది.

భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల ముందే అలర్ట్ అయిన సైబరాబాద్​పోలీసులు.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్​ఇవ్వాలని ట్రాఫిక్​అడ్వైజరీ ఇవ్వగా, ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బుధవారం సాయంత్రం అంతా ఒకే టైమ్కు ఆఫీసుల నుంచి బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు నరకం చూశారు.

గచ్చిబౌలి నుంచి కొత్తగూడ మీదుగా కొండాపూర్​వైపు తీవ్రమైన ట్రాఫిక్​ రద్దీ ఏర్పడింది. వర్షం పడుతుండడంతో  రోజూ బైక్‌‌‌‌లపై వచ్చే వారు కార్లను ఆశ్రయించడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. పలుచోట్ల లోతట్లు కాలనీలు, అపార్ట్​మెంట్ల సెల్లార్లలోకి వరద చేరింది. దీంతో మోటార్లు పెట్టి నీళ్లను బయటకు పంపించాల్సి వచ్చింది.