కలియుగ దేవుడు.. వైకుంఠనాథుడు.. ఏడుకొండలస్వామి.. శ్రీనివాసుడు.. శ్రీ వెంకటేశ్వరస్వామి.. తిరుమల శ్రీవారిని దర్శనం కోసం భక్తులు గంటలు.. రోజుల తరబడి వేచి ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతున్నాయి. అయితే పురాణాల ప్రకారం..రోజువారీ నక్షత్రాలను బట్టిస్వామి వారిని దర్శిస్తే కొన్ని ప్రత్యేక ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఏ నక్షత్రం రోజున స్వామి వారిని దర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సృష్టి మొత్తానికి మూలపురుషుడైన శ్రీమన్నారాయణుని విరాట్‌స్వరూపంలో రాత్రి,పగలు స్వామికి ఇరుపక్కలుగా నక్షత్రాలే.. స్వామివారి ఆకారంగా, అశ్వినిలు స్వామివారి పెదవులుగా వర్ణించబడింది. పురాణాల ప్రకారం విష్ణువు విశ్వంమొత్తం వ్యాపించబడి ఉన్నాడు . ఆకాశంలో మనకు కనపడే నక్షత్రమండలాలు, గ్రహమండలాలు,సూర్యచంద్రులు అన్నీ ఆస్వామి విరాట్‌రూపంలోనివేనని పండితులు చెబుతున్నారు. ఈసమస్త విశ్వమూ తనస్వరూపమైన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీనివాసునిగా వెలసి భక్తుల నిత్యపూజలందుకుంటున్నాడు. వారివారి కోర్కెలు తీరుస్తున్నాడు.
ఆస్వామిని దర్శించడానికి ప్రత్యేకసమయమంటూ ఏదీ లేదు. కాలపురుషుడైన ఆ పరబ్రహ్మమూర్తిని దర్శించడానికి అన్నికాలాలూ మంచివేం అయితే ఒక్కొక్కనక్ష్మత్రంనాడు దర్శిస్తే ఒక్కొక్కప్రత్యేక ఫలితం ఉంటుంది. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ,రవిసంచారమార్గం కలిగిన అశ్విని నుంచి రేవతి వరకు గల ఇరవైఏడు నక్షత్రాలకే ప్రాధాన్యం కలిగింది. 360 డిగ్రీల సూర్యుడు సంచారమార్గంలో ప్రతీరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో ఆరోజు ఆ నక్షత్రంగా వ్యవహరింపబడుతున్నది.
అశ్వనీ : ఈనక్షత్రం ఉన్న ఘడియల్లో తిరుమల శ్రీనివాసుడిని దర్శిస్తే దీర్ఘకాలిక రోగాలనుంచి ఉపశమనం .. ఎలాంటి అనారోగ్యమైనా నశిస్తుంది.
భరణీ: ఈ సమయంలో ఆనందనిలయంలోని స్వామిని దర్శించినవారికి అపమృత్యుభయం తొలగిపోతుంది.
కృత్తికా: ఇది శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని జన్మనక్షత్రం.ఆనాడు శ్రీనివాసుని దర్శించినవారికి చక్కటిచదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహిస్తారు.!
రోహిణీ : ఈ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ..ఎటువంటి మానసికసమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.!
మృగశిర: ఈ నక్షత్రం స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది.ఈ నక్షత్రంరోజున శ్రీనివాసుని దర్శించినవారికి..
సర్వశుభాలు కలుగుతాయి.!
ఆరుద్ర : నక్షత్రానికి అధిదేవతరుద్రుడు. ఈనక్షత్రంరోజున స్వామిని దర్శించినవారికి ఎటువంటి ఆపదలూ కలుగవు.
పునర్వసు: స్వామివారు రామచంద్రుని అవతారంలో జన్మనక్షత్రమైన ఈ నక్షత్రం రోజు ఆనంద నిలయంలోని స్వామినిదర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసికసమస్యలుఉన్నవారు పునర్వసునాడు స్వామినిదర్శిస్తే చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. కుటుంబంలోశాంతి,సౌభాగ్యాలు వెల్లివెరుస్తాయి.!
పుష్యమి : ఈ నక్షత్రంనాడు స్వామినిదర్శిస్తే.. వెయ్యిజన్మల పాపం నశిస్తుంది.!
ఆశ్లేష : ఈ నక్షత్రానికి అధిదేవత ఆదిశేషుడు. ఆరోజు స్వామినిదర్శించినవారికి.. ఎటువంటిభయాలైనా తొలగిపోతాయి. శారీరక,మానసికసమస్యలన్నీ ఇట్టేమాయమౌతాయి. మనస్సంతా ప్రశాంతతతో నిండిపోతుంది.
మఖ: ఈ నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే..అష్టైశ్వర్యాలు లభిస్తాయి.!
పుబ్బ : జగన్మాతనక్షత్రమైన 'పూర్వఫల్గుణి' (పుబ్బ) నక్షత్రంనాడు శ్రీస్వామివారినిదర్శిస్తే..
కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది.. వివాహంఆలస్యం అవుతున్నయువకులకు కూడా వెంటనే పెళ్ళినిశ్చయమౌతుందని పండితులు చెబుతున్నారు.
ఉత్తర : స్వామివారి ప్రియసఖి శ్రీమహాలక్ష్మీనక్షత్రమైన 'ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించినవారికి..సర్వసౌభాగ్యాలు కలుగుతాయి.! ఎంతో ఐశ్వర్యవంతులౌతారు.!
హస్త: ఈ నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శించినవారికి ఎటువంటిఅనారోగ్యమైనా క్షణంలో తొలగిపోతుంది.!
చిత్త : ఈ నక్షత్రంనాడు స్వామివారినిదర్శిస్తే..యశస్సు,సకలసంపదలు కలుగుతాయి. శరీరం నూతనతేజస్సుతో నిండిపోతుంది.!
స్వాతి : ఈ నక్షత్రం శ్రీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం.స్వామినరసింహునిగా అవతరించి
హిరణ్యకశిపుని సంహరించాడు. ఈ నక్షత్రంలో శ్రీనివాసుడినిదర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది.!
ఎటువంటి ప్రమాదాలు జరగవు.ఎటువంటి ఆపదలు కలుగవని పండితులు చెబుతున్నారు.
ప్రసిద్ధి కలది.
విశాఖ : ఈ నక్షత్రం రాధాదేవి నక్షత్రం . ఆ రోజున శ్రీనివాసుని దర్శించినవారికి త్వరలో వివాహమౌతుంది. కన్యలకు మంచి యువకులు,యువకులకు మంచి కన్యలు,జీవితభాగస్వాములుగా లభిస్తారు.
అనూరాధ : ఈనక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి.!
ఎంతోకాలంనుండి తీరనిఅప్పులు కొద్దినెలల్లోనే తీరిపోతాయి.
జ్యేష్ట : ఈ నక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి ఉన్నతపదవులు లభిస్తాయి.! సర్వసంపదలూ చేకూరుతాయి.
మూల : ఈ నక్షత్రం చదువులతల్లి సరస్వతీదేవి జన్మనక్షత్రం.ఈరోజు స్వామివారిని దర్శించినవారికి
సర్వవిద్యలూ లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో అద్భుతవిజయం సాధిస్తారు.!
పూర్వాషాఢ : ఈ నక్ష్మత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది.!
ఉత్తరాషాఢ: ఈ నక్షత్రంలో స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది.! సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి.! మనస్సంతా ప్రశాంతత కలుగుతుంది.!
శ్రవణం : ఇది శ్రీమన్నారాయణుల వారి జన్మనక్షత్రం . ఆరోజు ఆనందనిలయంలో స్వామివారిని దర్శించినవారు జీవించినంతకాలం సుఖంగాజీవించి చివరన ముక్తిని పొందుతారు.దేనికీ లోటులేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది.!
ధనిష్ట : ఈ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే.. ఐశ్వర్యం లభిస్తుంది.ఎంతోకాలంగా రావలసినసొమ్ము వెంటనే
చేతికి వస్తుంది.
శతభిషం: ఈ నక్షత్రం రోజున స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
సకాలంలో వర్షాలుకురిసి మంచిపంటలు పండుతాయి.!
పూర్వాభాద్ర : ఈ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ఎన్నోరోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి.!
ఉత్తరాభాద్ర : ఈ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది.!
రేవతి: ఈ నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలూ కలుగుతాయి.ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోయి సంపూర్ణఆరోగ్యం లభిస్తుంది.!
ఇలాంటి ఫలితాలు కేవలం తిరుమల శ్రీవారిని కాదు.. మీకు దగ్గరలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలోనే స్వామి వారిని దర్శించుకున్న అలాంటి ఫలితాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
