ములుగు: 50 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం చూపుతున్నం

ములుగు: 50 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం చూపుతున్నం

ములుగు, వెలుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రామచంద్రపురంలో 50 ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. గ్రామంలోని 10,600 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసి హక్కులు కల్పించనున్నామని, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శుక్రవారం రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాదర్బార్‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బోర్ఖడే హేమంత్‌‌‌‌‌‌‌‌ సహదేవరావుతో కలిసి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజా దర్బార్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రూ.30 లక్షలతో నిర్మించనున్న గోదాములు, మహిళా సంఘాల వీవో భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూళ్ల ప్రారంభానికి ముందే హాస్టళ్లలో పరిశుభ్రత, భద్రతాచర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలోని  ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రాల్లో డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో వికాస్‌‌‌‌‌‌‌‌ మీనా, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు సీహెచ్‌‌‌‌‌‌‌‌.మహేందర్‌‌‌‌‌‌‌‌, ఎం. సంపత్‌‌‌‌‌‌‌‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బానోతు రవిచందర్, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ రేగ కల్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ బైరెడ్డి భగవాన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బొక్క సత్తిరెడ్డి, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్ పాల్గొన్నారు.