బూత్స్థాయి ఏజెంట్లు అలర్ట్గా ఉండాలి : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

బూత్స్థాయి ఏజెంట్లు అలర్ట్గా ఉండాలి : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం/ హసన్​పర్తి, వెలుగు: సర్​ ప్రోగ్రామ్​తో అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు సూచించారు. శుక్రవారం భద్రాచలం నియోజరవర్గంలోని బూత్​స్థాయి లీడర్లకు, హనుమకొండ అంబేద్కర్​ భవన్​లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ బూత్​స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. భద్రాచలంలో వెంకట్రావు మాట్లాడుతూ సర్​ ప్రోగ్రాంలో పాల్గొనే అధికారులతో పాటు బూత్ స్థాయిలో పార్టీ లీడర్లు కూడా పర్యవేక్షించాలన్నారు. 

హనుమకొండలో ఎంపీ కడియం కావ్య పాల్గొని పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ద్వారా ఎస్ఐఆర్​ ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్​స్థాయి కార్యకలాపాలు, ఏజెంట్ల బాధ్యతలపై అవగాహన కల్పించారు. భద్రాచలంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్నకుమారీ, టీపీసీసీ తరుఫున సూపర్​ ట్రైనర్​ కోఆర్డినేటర్​ గరిశెల సురేందర్​ ముదిరాజ్, హనుమకొండ ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ శంకర్​ నాయక్, కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్​ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, వరంగల్​కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు ఎండీ అయూబ్​తదితరులు పాల్గొన్నారు.​