వెహిక‌ల్స్ పై ‘క‌రోనా ఫైన్లు’ రూ.43 కోట్లు.. 17 వేల‌ లాక్ డౌన్ ఉల్లంఘ‌న కేసులు

వెహిక‌ల్స్ పై ‘క‌రోనా ఫైన్లు’ రూ.43 కోట్లు.. 17 వేల‌ లాక్ డౌన్ ఉల్లంఘ‌న కేసులు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం మార్చి 22 నుంచి తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమ‌లులో ఉంది. ప్ర‌జ‌ల‌వరూ అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి రావొద్ద‌ని, అత్య‌వ‌స‌రమైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని మొద‌టి రోజు నుంచి ప్ర‌భుత్వాలు కోరుతూ వ‌చ్చాయి. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు ఇరు రాష్ట్రాల సీఎంలు. అయినా లెక్క చేయ‌కుండా అకార‌ణంగా రోడ్ల‌పైకి వ‌చ్చిన‌వారిపై కేసుల న‌మోదు చేశారు పోలీసులు. ఏపీలో క‌రోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీగా కేసుల న‌మోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు 9.76 లక్షలపై కేసులు పెట్టారు పోలీసులు. 54 వేల ఎఫ్ఐఆర్ లు న‌మోద‌య్యాయి. ప‌దేప‌దే నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 17 వేల మందిని అరెస్టు చేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి అరెస్ట‌యిన కేసుల్లో ఎక్కువ‌గా విజ‌య‌వాడ‌లోనే ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

58 వేల వాహ‌నాల సీజ్

లాక్ డౌన్ నిబంధ‌ల‌ను ఉల్లంఘించి రోడ్ల‌పైకి వ‌చ్చిన 58 వేల వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహ‌నాల‌పై రూ.43 కోట్లు ఫైన్లు వేశారు. వాహనాల అత్య‌ధిక ఫైన్లు విధించిన జిల్లా అనంతపురం అని పోలీసులు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించాలంటే ప్రజలందరూ.. ఇంట్లోనే ఉండాల‌ని, అన‌వ‌స‌రంగా బయటకు రావద్దంటుని పోలీసులు సూచిస్తున్నారు.