
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,64,228 కి పెరిగింది. అలాగే మరో 67 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,912కి చేరింది. ఆదివారం10,131 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా..ఇప్పటివరకు మొత్తం 4,64,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 95,072 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,99,826 టెస్టులు జరిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఆదివాచం ఉభయగోదావరి జిల్లాలలో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.