లోయలో పడిన తెలుగు విద్యార్థుల విహారయాత్ర బస్సు

లోయలో పడిన తెలుగు విద్యార్థుల విహారయాత్ర బస్సు

కర్ణాటక: విద్యార్థుల విహారయాత్రలో విషాదం జరిగింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురయింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు.. ఉపాధ్యాయులతో కలిసి రెండు రోజుల క్రితం విహారయాత్రకోసం కర్ణాటక వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఉడిపి సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులతో పాటు, 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బాబా ఫకృద్దీన్ అనే విద్యార్థి మృతి చెందగా, 35 మంది విద్యార్థులు, టీచర్లు గాయపడ్డారు. వీరంతా కదిరి నుంచి కర్ణాటకకు వెళ్లి అక్కడ ఒక బస్సు కిరాయికి తీసుకొని జోగ్ ఫాల్స్, ఉడిపి, ధార్వాడ్ తదితర ప్రాంతాలు చూడటానికి బయలుదేరారు. గత రాత్రి వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 50 నుంచి 100 అడుగుల లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

For More News..

టిప్ చాలెంజ్: 2020 డాలర్లు టిప్ ఇచ్చిన అమెరికన్ సింగర్