ఏప్రిల్ 11న : ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు

ఏప్రిల్ 11న : ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు
  • గట్టిగా నెల రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ రాబోతోంది. తొలి దశలోనే ఏపీ, తెలంగాణల్లో ఓటింగ్ జరుగబోతోంది. 

దేశంలో పార్లమెంటు ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఈ రోజు సాయంత్రం ప్రకటించింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు మొదలై మొత్తం ఏడు దశలకు కలిపి మే 23న కౌంటింగ్ జరుగుతుందన్నారు.

మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జరగబోతోంది. ఏప్రిల్ 11న తొలి దశలోనే ఏపీలోని 25 ఎంపీ సీట్లు, తెలంగాణలోని 17 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అంటే  గట్గిగా నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఏపీలో అసెంబ్లీకి కూడా కలిపి ఎన్నికలు జరుగుతాయి. మార్చి 18న రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి మార్చి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 28 వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకోవచ్చు.