యాక్టివా లేదా యూనికార్న్.. ఏదైనా కొనే ప్లాన్ ఉందా..? అయితే పండగ చేస్కోండి..!

యాక్టివా లేదా యూనికార్న్.. ఏదైనా కొనే ప్లాన్ ఉందా..? అయితే పండగ చేస్కోండి..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి GST కొత్త పాలసీ అమల్లోకి వస్తుండటంతో కొత్త బైక్స్, స్కూటీలు కాస్తంత అగ్గువకే కొనుక్కునే అవకాశం వినియోగదారులకు ఉంది. ఇండియన్ టూవీలర్ మార్కెట్లో దగ్గరదగ్గర 98 శాతం మార్కెట్ స్కూటర్స్, 350 సీసీ లోపు ఉన్న మోటార్ సైకిల్స్దే కావడం గమనార్హం. జీఎస్టీ 2.0 అమల్లోకి వస్తే గతంలో వీటిపై విధించిన 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. ఈ కారణంగా.. సెప్టెంబర్ 22 తర్వాత స్కూటీలు, 350cc లోపు బైక్స్ కొనుక్కునే వారికి తగ్గింపు ధరలు వర్తిస్తాయి.

హోండా యాక్టివా, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బండ్లు కాస్తంత చౌక ధరకే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. జీఎస్టీ రేట్ కట్కు తోడు ఫెస్టివల్ సీజన్ కావడంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఆఫర్లకు తెరలేపాయి. సెప్టెంబర్ 22 నుంచి ఏ మోడల్ స్కూటీపై, బైక్ పై ఎంత ధర తగ్గే అవకాశం ఉందో ఓ లుక్కేద్దాం.

* హోండా టూ-వీలర్లు-రూ. 18,887 వరకు తగ్గింపు (350cc లోపు)
* యాక్టివా 110: రూ. 7,874 తగ్గింపు
* డియో 110: రూ. 7,157 తగ్గింపు
* యాక్టివా 125: రూ. 8,259 తగ్గింపు
* డియో 125: రూ. 8,042 తగ్గింపు
* షైన్ 100: రూ. 5,672 తగ్గింపు
* షైన్ 100 DX: రూ. 6,256 తగ్గింపు
* లివో 110: రూ. 7,165 తగ్గింపు
* షైన్ 125: రూ. 7,443 తగ్గింపు
* SP125: రూ. 8,447 తగ్గింపు
* CB125 హార్నెట్: రూ. 9,229 తగ్గింపు
* యునికార్న్: రూ. 9,948 తగ్గింపు
* SP160: రూ. 10,635 తగ్గింపు
* హార్నెట్ 2.0: రూ. 13,026 తగ్గింపు
* NX200: రూ. 13,978 తక్కువ
* CB350 H'ness: రూ. 18,598 తగ్గింపు
* CB350RS: రూ. 18,857 తగ్గింపు
* CB350: రూ. 18,887 తక్కువ

టూవీలర్ సెగ్మెంట్‌‌‌‌లో  హీరో మోటోకార్ప్ కంపెనీ 2024–25 లో 54 లక్షల బండ్లను అమ్మింది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం, హోండా మోటర్‌‌‌‌సైకిల్ అండ్‌‌‌‌  స్కూటర్ ఇండియా 48 లక్షల బండ్లను అమ్మింది. టీవీఎస్ మోటార్ 33 లక్షల బండ్లను అమ్మింది. 2024–25లో మొత్తం టూ-వీలర్ రిజిస్ట్రేషన్లు  ఏడాది లెక్కన 8 శాతం పెరిగి సుమారు 1.89 కోట్ల బండ్లకు చేరుకున్నాయి.