
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఆడియన్స్కి ఎప్పుడు కొత్త అనుభూతే. ఇందులో ఉండే మిస్టరీ థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా మైండ్కి పదునుపెట్టేలా ఉండటంతో ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు. దర్శకుడు సబరీష్ నంద రాసుకున్న స్క్రిప్ట్, ఎంగిజింగ్ స్క్రీన్ ప్లే.. ఆడియన్స్ని థ్రిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అదే రీసెంట్ రిలీజ్ తమిళ మూవీ ‘ఇంద్ర’ (INDRA).
2025 ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న సన్ నెక్ట్స్తో పాటు టెంట్ కోటా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్కు వచ్చి దూసుకొస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో హీరోగా వసంత్ రవి, హీరోయిన్గా మెహ్రీన్ నటించింది. యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ స్పెషల్ రోల్ చేసింది. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ విలన్గా నటించి ఆకట్టుకున్నాడు.
సబరీష్ నంద డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కథ ఓ ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. సస్పెండ్ అయిన పోలీస్, ఓ సీరియల్ కిల్లర్, హత్యకు గురైన భార్య.. ఇలా ముగ్గురు చుట్టూ కథ తిరుగుతూ.. ఉత్కంఠరేపే ట్విస్ట్ లతో ఆసక్తిగా ఉంటుంది. పూర్తి కథగా చూస్తే..
👁️🗨️ A blind ex-cop. A haunting past. A hunt for the truth that cuts deeper than revenge.
— SUN NXT (@sunnxt) September 20, 2025
Watch Indra on SunNXT – where every secret comes at a price. 🔥#Indira #Thriller #CrimeDrama #DarkPast #SunNXT pic.twitter.com/1GRqKnavuD
‘ఇంద్ర’ కథ:
ఇంద్ర (వసంత్ రవి) సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. మందుకు బానిసై రోజూ తాగుతుంటాడు. భార్య కాయల్ (మెహ్రీన్ పిర్జాదా)తో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. అతని వ్యసనం, కోపం వల్ల అనుకోకుండా తన కంటి చూపు కూడా కోల్పోతాడు. దాని వల్ల మళ్లీ భార్యకు దగ్గరవుతాడు. వాళ్లు కంటి మార్పిడి కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒకరోజు కాయల్‌ని ఎవరో హత్య చేస్తారు. అప్పుడు ఇంద్ర మరొక గదిలో నిద్రపోతుంటాడు.
తన భార్య చనిపోయినట్లుగానే ఆ ఊళ్ళో మరికొంత మంది మహిళలు కూడా హత్యకు గురవుతారు. ఆ సీరియల్ కిల్లర్ ని కనిపెట్టే క్రమంలో హీరోకు కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంద్ర తన భార్య మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఆమెని చంపిందెవరు? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.