రేపటి నుంచి సామాన్యులకి పండగే.. పాలు నుండి టీవీ, కారు వరకు ఈ 400 వస్తువుల ధరల తగ్గింపు..

రేపటి నుంచి సామాన్యులకి పండగే.. పాలు నుండి టీవీ, కారు వరకు ఈ 400 వస్తువుల ధరల తగ్గింపు..

సామాన్య ప్రజలకి ఖర్చుల  భారం తగ్గించేందుకు ప్రభుత్వం GST రేట్లను తగ్గించింది. అలాగే తగ్గించిన GST రేట్లను సెప్టెంబర్ 22 నుండి అమలు చేయాలని నిర్ణయించగా.... ఈ నిర్ణయంతో వంటగది నుండి మీ కారు, టీవీ-ఫ్రిడ్జ్, హోమ్ అప్లియన్సెస్, పాలు-నెయ్యి-వెన్న, జున్ను, బట్టలు-బూట్లు వరకు ప్రతిదాని ధర మారుతుంది. GST రేట్ల తగ్గింపు ప్రయోజనాలను అందించడానికి ఇప్పటికే మదర్ డైరీ, అమూల్, ITC వంటి కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరలను తగ్గించాయి.

సెప్టెంబర్ 22 నుండి : కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 నుండి వర్తిస్తాయి. సెప్టెంబర్ 22 నుండి, GST కేవలం రెండు శ్లాబ్‌లలో 5% లేదా 18% మాత్రమే ఉంటుంది. పనీర్, నెయ్యి, సబ్బు-షాంపూ వంటి సాధారణ నిత్య వస్తువులతో పాటు AC, కారు 0% లేదా 5% GST శ్లాబ్‌లో ఉంచింది. GST రేట్లను మార్చడం ద్వారా  పిండి, బియ్యం, పప్పులు, పాలు, నెయ్యి, వెన్న వంటివి కూడా చౌకగా మారతాయి. మొత్తంగా సెప్టెంబర్ 22 నుండి దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గుతాయి. 

GST తగ్గింపుతో చౌకగా లభించే వస్తువుల లిస్ట్ ఇదే:
పాశ్చురైజెడ్ పాలు, వెన్న, నెయ్యి, వెన్న నూనె, పాల స్ప్రెడ్‌లు, పనీర్ (చీజ్),  పనీర్, రోటీ, చపాతీ, పాపడ్, పాస్తా, నూడుల్స్, కౌస్కాస్, పేస్ట్రీలు, కేకులు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, స్టీల్ గిన్నెలు, నమ్కీన్, భుజియా, మీక్షర్ (ప్యాకేజ్ చేసినవి), సాస్‌లు, మసాలాలు, మసాలా పొడి,  టీ, కాఫీ పౌడర్, షికోరి  కాఫీ గింజలు, జామ్, జెల్లీ, మార్మాలాడే, కొబ్బరి నీళ్లు (ప్యాక్ చేసినవి), కండెన్సడ్ పాలు, టూత్ బ్రష్, డెంటల్-ప్లేట్ బ్రష్, టూత్‌పేస్ట్, పళ్ళ పొడి, టాయిలెట్ సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ లోషన్, ఆఫ్టర్ షేవ్,  నేప్కిన్లు, పిజ్జా బ్రెడ్, పరాఠా, పరోటా బ్రెడ్, మట్టి గిన్నెలు,  సిరామిక్ టేబుల్‌వేర్, కిచెన్‌వేర్,  డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు, అంజూర పండ్లు, పైనాపిల్, అవకాడో, మామిడి (ఎండినవి), సిట్రస్ పండ్లు (నారింజ, మాండరిన్లు, ద్రాక్షపండు, నిమ్మకాయలు) , ఇతర డ్రై ఫ్రూట్స్, గింజల మిశ్రమాలు (చింతపండు తప్ప), బ్రెజిల్ గింజలు, చక్కెర స్వీట్స్, చాక్లెట్, ఇతర బేకర్ల ఉత్పత్తులు, ఐస్ క్రీం, సూప్‌లు, రసం, టమోటా, పుట్టగొడుగుల నిల్వలు, వెనిగర్లో నానపెట్టిన కూరగాయలు, ఈస్ట్, బేకింగ్ పౌడర్,  టెక్స్చరైజ్డ్ వెజిటబుల్ ప్రోటీన్, ఎక్స్‌ట్రూడెడ్ నమ్‌కీన్, కొబ్బరి వెన్న, కొబ్బరి నూనె,కొబ్బరి  పొడి, మాల్ట్-బార్లీ, కూరగాయల రసాలు, రిఫ్రిజిరేటర్,  వాషింగ్ మెషీన్, టెలివిజన్ సెట్లు (అన్ని సైజులు) , ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ కుక్కర్, రైస్ కుక్కర్, హీటర్, గ్రైండర్, మిక్సర్, జ్యూసర్, కుట్టు మెషిన్, వాక్యూమ్ క్లీనర్, ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిట్నర్, ఎలక్ట్రిక్ షేవర్, రూ.2500లోపు ఉన్న  చెప్పుల ధర, కార్పెట్,  వెదురు, మెటల్ ఫర్నిచర్, చెక్క ఫర్నిచర్, ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్, గ్లాస్ గాజులు, కొవ్వొత్తులు, గొడుగులు, హ్యాండ్‌క్రాఫ్ట్ హ్యాండ్‌బ్యాగులు, పౌచ్‌లు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, షాపింగ్ బ్యాగులు, చేతితో తయారు చేసిన శాలువాలు, టోపీలు, పెన్సిళ్లు, క్రేయాన్లు, పాస్టెల్లు, సుద్ద, రబ్బరు బ్యాండ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్లు, బొమ్మలు, ప్లేయింగ్ కార్డ్స్, చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు, ఎడ్యుకేషనల్ టాయ్స్, పేపర్‌బోర్డ్, వ్యక్తిగత ఉపయోగం కోసం అన్ని మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, రియాజెంట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతి గ్లవుజులు, కాంటాక్ట్ లెన్సులు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు, జిప్సం, సిసల్, బాగస్సే, పత్తి కాండాలు, సిరామిక్ బిల్డింగ్ బ్రిక్స్, బ్లాక్స్, టైల్స్, తబలా, మృదంగం, వీణ, సితార్, ఫ్లూట్,  షెహనాయ్, ఢోలక్,  సైకిల్, డిష్ వాషర్, బైక్స్ (350cc వరకు), స్కూటర్లు, మోపెడ్‌లు, ఆటో, ఈ-రిక్షా,కార్లు (చిన్న ఇంకా మధ్య), విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు, అగ్గిపుల్లలు ఇంకా కొన్ని ఇతర ఉన్నాయి. 

దేని ధరలు  పెరుగుతాయంటే : పాన్ మసాలా, అన్ని ఫ్రీల్వర్స్ లేదా స్వీట్   వాటర్,  ఆల్కహాల్ లేని పానీయాలు, కార్బోనేటేడ్ పండ్ల పానీయాలు, కెఫిన్ ఉన్న పానీయాలు, మొక్కల ఆధారిత పాల పానీయాలు, ముడి పొగాకు, పొగాకు ఉన్న ఉత్పత్తులు, సిగార్లు,  సిగరెట్లు పొగాకు/నికోటిన్ ఉత్పత్తులు, బొగ్గు, బ్రికెట్లు, బొగ్గుతో తయారైన ఘన ఇంధనాలు, లిగ్నైట్,  మెంథాల్ ఉత్పన్నాలు, బైక్స్ (350cc పైన),  SUVలు, లగ్జరీ కార్లు, రివాల్వర్లు ఇంకా పిస్టల్స్,  ప్రైవేట్ జెట్‌లు, వ్యాపార విమానాలు, హెలికాప్టర్లు, షిప్స్ ఉన్నాయి.