
వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( సెప్టెంబర్21 నుంచి సెప్టెంబర్ 27 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. పాత మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కార్యాలయంలో మీరే కీలకపాత్ర పోషిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పెళ్లి సంబంధాలు చూసే వారికి బంధు వర్గంలోని వారితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆదాయం వృద్ది చెందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ వారం.. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. పాత స్నేహితులు కలవడంతో కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి వచ్చే అవకాశాలున్నాయి. ఎవరిపై ఆధారపడకుండా.. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భూ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండంది. గతంలో రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లభిస్తుంది. ఉద్యోగస్తులు... వ్యాపారస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జాబ్ మారాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ రాశి వారు ఈ వారం ఓర్పు... సహనం కలిగి ఉండాలి. పాత స్నేహితులు కలవడం వలన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సామాన్యలాభాలు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికరాశి: ఈ వారం ఈవారికి అన్ని విధాలుగా బాగుంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను నియంత్రించుకోండి. నిరుద్యోగులు వారం చివరిలో గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అన్ని విధాలుగా బాగుంటుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి: ఈ రాశి ఈ వారంలో కొత్త అవకాశాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందుఉండవు. నిరుద్యోగులు జాబ్ ఆఫర్ అందుకుంటారు.
మకరరాశి : ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని విషయంలో కూడా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రోజు వారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వారం అంతా ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
కుంభరాశి: ఈ వారం ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు పష్కలంగా ఉంటుంది. గతంలో ఉన్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడి. పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మీనరాశి: ఈ వారం మీరు మీ జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కెరీర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నిరుద్యోగులు మంచి జాబ్ కోసం కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.