
హైదరాబాద్ సిటీలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన OG ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ వర్షం కారణంగా అర్థాంతరంగా ముగిసింది. They Call Him OG Concert కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని, వేల మంది అభిమానుల మధ్య భారీగా ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేరె లెవెల్ ఎంట్రీ, ఆయన ప్రసంగం అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచింది. కానీ.. వర్షం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఈవెంట్ అర్థాంతరంగా ముగిసిపోవడం వల్ల ఖర్చు పెట్టి కూడా ఫైనాన్షియల్గా లక్షల్లో లాస్ అయిన పరిస్థితి. పవర్ స్టార్ స్పీచ్ను నడి వర్షంలోనే ఆయన అభిమానులు విన్నారు.
వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఈవెంట్ను మధ్యలోనే ముగించేసి వెళ్లిపోయారు. ట్రైలర్ రిలీజ్ చేయాలని OG దర్శకుడు సుజిత్ను పవన్ కల్యాణ్ అడగ్గా.. ట్రైలర్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అవలేదని చెప్పడంతో అభిమానులు నిరాశ చెందారు. అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ చూపించాల్సిందేనని పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేసి ఈవెంట్ను ముగించేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్కు వెళ్లిన వారికి మాత్రమే OG ట్రైలర్ను వీక్షించే అవకాశం దక్కింది.
ఆన్ లైన్లో OG ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. ఈ పరిణామం ఈవెంట్కు వెళ్లలేకపోయి ట్రైలర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను మరింత బాధించింది. వాస్తవానికి OG ట్రైలర్ ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకే విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు ఆదివారం ఉదయం నుంచే ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందోనని ఎదురుచూశారు.
ట్రైలర్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేస్తామని ప్రకటించడంతో పవన్ అభిమానులు శాంతించారు. కానీ.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం, ట్రైలర్ వర్క్ ఇంకా కంప్లీట్ అవలేదని దర్శకుడు ఇంకా నెట్టింట ట్రైలర్ వదలకపోవడంతో ఇక ఇవాళ ట్రైలర్ రిలీజ్ లేనట్టేనని పవన్ అభిమానులు డిసైడ్ అయిపోయారు. సోమవారం ఉదయం OG ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది.
OG FULL Trailer Leaked 💥💥#OGconcert #OGTrailer #TheyCallHimOG pic.twitter.com/AKYICoso3v
— Nayan Rana (@nayanRana83) September 21, 2025