ఏపీ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్ రిలీజ్

ఏపీ టెన్త్  సప్లిమెంటరీ రిజల్ట్ రిలీజ్

 ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేశాయి. జూన్ 23న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు.   ఫలితాలను విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పాఠశాల లాగిన్‌లో సంబంధిత విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మార్కుల జాబితాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2 నుంచి 10 వరకు జరిగిన పరీక్షల్లో  1. 9 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ రిజల్ట్ ను విడుదల చేశారు. రెగ్యులర్ ఫలితాల్లో 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.