AP:ఉద్యోగులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

AP:ఉద్యోగులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అమరావతి: కొత్త పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని పిలిచింది.  సమ్మెకు నోటీసు ఇచ్చి  ఆందోళన బాట పట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సాయంత్రం వరకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని కుండబద్దలు కొట్టిన మంత్రులు కొద్దిసేపటి క్రితం మెత్తబడినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 1వ తేదీన మంగళవారం కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, ఫించన్లు ఇస్తామంటూ.. ఏర్పాట్లు చేసినప్పటికీ.. మళ్లీ రేపు మధ్యాహ్నం మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఆహ్వానం పంపారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చలకు రావాలని ఆహ్వానించారు. చివరి నిమిషంలో ప్రభుత్వం మరోసారి వెనుకడుగు వేసి చర్చలకు ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. రేపేం జరగనుందోనన్న ఉత్కంఠ హాట్ టాపిక్ గా మారింది. 

ఇవి కూడా చదవండి

 

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!

యూపీలో రసవత్తర పోరు.. అసెంబ్లీ బరిలో అఖిలేష్