ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!

ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!
  • మహబూబాబాద్లో కరోనాపై వినూత్న ప్రచారం
  • పుష్ప మూవీ పేరడీ సాంగ్తో అవగాహన

మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది వినూత్న రీతిలో కరోనా మహమ్మారిపై ప్రచారం కల్పిస్తున్నారు. చెత్త సేకరణ కోసం పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ని వినియోగిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కు మైక్ అమర్చిన సిబ్బంది.. " ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !! " అనే పేరడి పాటను ప్లే చేస్తూ గ్రామస్థులకు  కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.  " టీకా లేక...మాస్కు లేక.. కరోనా వస్తే అందరికొస్తది..కరోనా బుద్ధి వొంకర బుద్ధి.." అంటూ సాగే ఈ పుష్ప మూవీ  పేరడి సాంగ్కి జనం పగలబడి నవ్వుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చిన ఈ ఐడియాకి ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ పాట ద్వారా జనాల్లో చాలా అవగాహన వస్తోందని ట్రాక్టర్ డ్రైవర్ సైదులు చెబుతున్నాడు. 

 

ఇవి కూడా చదవండి

పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ

ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!