బందరు పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర : సీఎం జగన్

బందరు పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర : సీఎం జగన్

బందరు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పోర్టు రాకపోతే అమరావతిలో తన భూములకు డిమాండ్ వస్తుందని బాబు కుట్ర చేశారని అన్నారు. మే 22వ తేదీ సోమవారం జగన్ మచిలీపట్నం పర్యటనలో భాగంగా బందరు పోర్టుకు శంకుస్ధాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడిన ఆయన.. అన్ని సమస్యలు అధిగమించి బందరు పోర్టుకు లైన్ క్లియర్ చేశామన్నారాయన. రూ.5,156 కోట్లతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. 

లక్ష ఉద్యోగాలు పోర్టుల ద్వారా రాబోతున్నాయని జగన్ చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు..పోర్టుకు ఉన్న గ్రహణాలు అన్నీ తొలిగిపోయాయని వ్యాఖ్యానించారు. పోర్టు రాకతో మరో 24 నెలల్లో మచిలీపట్నం రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు సీఎం జగన్. పోర్టు చిరకాల స్వప్నం..దీంతో బందరు వాసుల కలను నెరవేర్చామన్నారు. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని జగన్ గుర్తు చేశారు. వందల ఏళ్లు గడుస్తున్నా పోర్టు నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం జగన్ వెల్లడించారు.