హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అపర్ణ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ భారీ పెట్టుబడి.. రూ.2,200 కోట్లతో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అపర్ణ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ భారీ పెట్టుబడి.. రూ.2,200 కోట్లతో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్

హైదరాబాద్: అపర్ణ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎస్టేట్స్, హైదరాబాద్​లో కొత్త లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రూ.2,200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.  గోపన్‌‌‌‌‌‌‌‌పల్లిలో అపర్ణ డెక్కన్ టౌన్​లో 'అపర్ణ మూన్‌‌‌‌‌‌‌‌స్టోన్' అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్ సుమారు రూ.2,525 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తామని సంస్థ పేర్కొంది. 22.28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 2,088 అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను కంపెనీ నిర్మించనుంది.