మియాపూర్ లో అపర్ణ యూనిస్పేస్ మెగా స్టోర్ షురూ

మియాపూర్ లో అపర్ణ యూనిస్పేస్ మెగా స్టోర్ షురూ

హైదరాబాద్​, వెలుగు: అపర్ణ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్), హైదరాబాద్​లోని మియాపూర్​లో అపర్ణ యూనిస్పేస్​ మెగా స్టోర్​ను ప్రారంభించింది. ఇది ఇంటి డిజైనింగ్,  నిర్మాణానికి సంబంధించిన వస్తువులను అమ్ముతుంది.  ఫాసెట్స్​ నుంచి మొదలుకొని ఫసాడ్స్​​ వరకు అన్నింటినీ ఒకే చోట అందిస్తుంది.  ఇప్పటికే బెంగళూరు, విజయవాడలో అపర్ణకు యూనిస్పేస్​ షోరూంలు ఉన్నాయి. 

ఈ కొత్త యూనిస్పేస్​లో 20కి పైగా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇది బీ2బీ,  బీ2సీ కస్టమర్లకు సేవలు అందిస్తుంది. ఈ స్టోర్​లో టైల్స్​, శానిటరీవేర్​, మాడ్యులర్​ కిచెన్లు, వార్డ్​రోబ్స్​, కిటికీలు, తలుపులు, లైటింగ్​, ఇతర నిర్మాణ సామగ్రి వంటివి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఇంటరాక్టివ్​ జోన్స్​, టెక్-ఎనేబుల్డ్​ డిస్​ప్లేలు, ప్రొడక్ట్ డెమో ఏరియాలను కూడా ఏర్పాటు చేశారు.

 భారతదేశంలో నిర్మాణ రంగం 2024లో 42.6 బిలియన్ల డాలర్ల నుంచి 2033 నాటికి 64 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా.