
న్యూఢిల్లీ, వెలుగు: అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణిల హత్య కేసును ఇతర దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తమ వైఖరేంటో చెప్పాలని రాష్ట్ర సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ, మరో 12 మందికి నోటీసులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 17న రామగరి మండలం కలవచర్లలో కారులో వెళ్తోన్న అడ్వొకేట్ దంపతులను నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని, అందుకే సీబీఐతో విచారణ జరిపించాలని వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల బెంచ్ విచారించింది. ఈ కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు.