న్యూఢిల్లీ: ప్రభుత్వం, హెల్త్‌కేర్ సెక్టార్ మధ్య బ్రిడ్జిలా పనిచేస్తున్న నేషనల్ హెల్త్‌కేర్ ఫెడరేషన్ (నాట్‌హెల్త్) ప్రెసిడెంట్గా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఎన్నియ్యారు. ఆమె 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ చైర్‌పర్సన్ అమీరా షా ప్రెసిడెంట్‌గా సేవలందించారు.
పాలి మెడిక్యూర్ లిమిటెడ్ ఎండీ హిమాంశు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, క్వాలిటీ కేర్ లిమిటెడ్ గ్రూప్ ఎండీ వరుణ్ ఖన్నా వైస్ ప్రెసిడెంట్‌గా తాజాగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం, ఇండస్ట్రీ భాగస్వాములతో కలిసి నాణ్యత ప్రమాణాలను పెంచే విధానాలు తీసుకురావడం, ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం పెంచడం, సురక్షితమైన ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థను నిర్మించడం తమ లక్ష్యమని సంగీతా అన్నారు.
