గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు.. నన్నుక్షమించండి

గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు.. నన్నుక్షమించండి

తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆయన..ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చూశాకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో పేద ప్రజలు  పడుతున్న ఇబ్బందులకు తనను క్షమించాలన్నారు. ఎవరికోసమే లాక్ డౌన్ విధించలేదని..ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు. ఇంకా కొన్ని రోజులు లక్షణ రేఖ దాటొద్దన్నారు. కరోనా ఏ ఒక్క  ప్రాంతానికో,ప్రదేశానికో పరిమితం కాలేదన్నారు. ఇంకా కొందరు సీరియస్ గా తీసుకోవట్టేదన్నారు.

వైరస్ కు పేద,ధనిక తేడా లేదన్నారు. కరోనాపై చేస్తున్న యుద్దంలో గెలవాల్సిందేనన్నారు. లాక్ డౌన్ విధించడమే కరోనా నియంత్రణకు పరిష్కార మార్గం అన్నారు. కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరు కరోనాపై యుద్ధం చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు అని అన్నారు. కరోనాను గెలిచినవారు అందరికీ స్ఫూర్తిఅవుతారన్నారు. రోగం వచ్చినపుడే ట్రీట్ మెంట్ ఇవ్వాలని లేకపోతే ప్రమాదమన్నారు.