లేఆఫ్స్ దిశగా యాపిల్ కంపెనీ.. బ్లూమ్‌బర్గ్ ట్విట్ లో ఏముంది..? 

లేఆఫ్స్ దిశగా యాపిల్ కంపెనీ.. బ్లూమ్‌బర్గ్ ట్విట్ లో ఏముంది..? 

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యల పేరుతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో సంస్థ చేరిపోయింది. అదే యాపిల్ కంపెనీ. యాపిల్ కంపెనీ తాజాగా లే ఆఫ్ ప్రకటించనుంది. ఆపిల్ కార్పొరేట్ రిటైల్ టీమ్‌‌లలో తక్కువ సంఖ్యలో ఉద్యోగాల కోత విధించాలని తాజాగా నిర్ణయించారు. తొలగించనున్న ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించడం సాధ్యం కాదని, కాని ఉద్యోగుల తొలగింపు తక్కువగా ఉంటుందని తాజా నివేదిక పేర్కొంది. 

ఎన్నో గ్లోబల్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ సంస్థ మాత్రం లేఆఫ్స్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై యాపిల్‌లోనూ పరిస్థితులు మారబోతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది.

పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీంతో ఇటీవల కాలంలో అమెరికా దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోతలకు దారితీశాయి.ఫేస్‌బుక్ -పేరెంట్ మెటా ప్లాట్‌ ఫారమ్‌లు గత నెలలో, ఈ ఏడాది 10,000 మంది ఉద్యోగాలను తగ్గించనున్నట్టు పేర్కొంది. ఇది రెండవ రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన మొదటి బిగ్ టెక్ కంపెనీగా ఫేస్‌బుక్ నిలిచింది.

ప్రపంచ ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నందున ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు ఇటీవల తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకున్నాయి. యూఎస్ టెక్ కంపెనీలలో భారీగా ఉద్యోగుల తొలగింపుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి.