Apple Layoffs : మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన యాపిల్ కంపెనీ

Apple Layoffs : మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన యాపిల్ కంపెనీ

ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ Apple మరోసారి తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయింది. Apple  తన micoro LED ప్రాజెక్టును నిలిపివేసింది. కంపెనీ డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దంతోప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ టీంలకు చెంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం ఉండనుంది. విపరీతమైన ఖర్చులు, టెక్నాలజీ పరమైన కారణాలతో మైక్రో ఎల్ ఈడీ టెక్నాలజీ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.   

స్మార్ట్ వాచ్ డిస్ ప్లేల కోసం మైక్రో ఎల్ ఈడీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఆపిల్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. అయితే నిర్వహణ ఖర్చు, టెక్నాలజీ పరమైన కారణాలతో ఈ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. యూఎస్, ఆసియా పరిధిలోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. 

గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు,..2024 లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి టెక్  కంపెనీలు. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు,అప్ డేటెడ్ టెక్నాలజీ వినియోగం కొత్త వ్యాపారంలోకి  ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.. ఈ సంవత్సరం మొత్తం ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని టెక్ నిపుణులు అంచాన వేస్తున్నారు.