నిఫ్ట్‌‌‌‌లో యూజీ, పీజీ, పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్స్​

నిఫ్ట్‌‌‌‌లో యూజీ, పీజీ, పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్స్​

నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌‌‌‌లలో అకడమిక్ సెషన్ 2024, 25కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌‌‌‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

కోర్సులు : బ్యాచిలర్ ప్రోగ్రామ్‌‌‌‌: నాలుగేళ్ల డ్యూరేషన్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌‌‌‌): ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌‌‌‌టైల్ డిజైన్, నిట్‌‌‌‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌‌‌‌టెక్) కోర్సులు ఉంటాయి. 

మాస్టర్స్ డిగ్రీ : రెండేళ్ల వ్యవధి ఉంటుంది. ఇందులో మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌‌‌‌),  ఎంఎఫ్‌‌‌‌ఎం, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌‌‌‌టెక్‌‌‌‌) కోర్సులు ఉంటాయి. పీహెచ్‌‌‌‌డీ కోర్సులో (డిజైన్, మేనేజ్‌‌‌‌మెంట్, టెక్నాలజీ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు :  యూజీ కోర్సుకు ఇంటర్​లో ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌‌‌‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌‌‌‌టెక్‌‌‌‌, బీఈ, బీటెక్‌‌‌‌; పీహెచ్‌‌‌‌డీ ప్రోగ్రామ్‌‌‌‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తులు : యూజీ, పీజీ ప్రోగ్రామ్ జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పీహెచ్​డీ కోర్సుకు ఫిబ్రవరి 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.nift.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.