యాదాద్రి, వెలుగు:ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్‌కు అప్లయ్ చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పడాల రవీందర్ కోరారు. 25 ఏండ్లలోపు ఉన్న పదో తరగతి ఆపై చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకూ ప్రతి నెల రూ. 9 వేలు స్టైఫండ్‌గా అందుతుందని చెప్పారు.

