ఆ లెక్కన.. కేంద్రం16 కోట్ల ఉద్యోగాలియ్యాలె

ఆ లెక్కన.. కేంద్రం16 కోట్ల ఉద్యోగాలియ్యాలె

ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని వాగ్దానం చేశారని పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే.. నేటికి 16 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలిపారు. ఈ విషయంపై తాను పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 2014- 22 వరకు 22కోట్ల దరఖాస్తులు రాగా.. అందులో 7 లక్షల 22వేల మందికి మాత్రమే నియామకాలిచ్చారని తెలిపారు.