
నెయిల్ పాలిష్ మరింత కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..నెయిల్ పాలిష్ వేసుకునేముందు గోళ్లని శుభ్రంగా కడిగి, షేప్ చేయాలి. అలాగే గోళ్లలో తడి లేకుండా చూసుకోవాలి. గోళ్లకి మొదట వైట్ కలర్ నెయిల్ పాలిష్‌తో బేస్‌కోట్ వేయాలి. అది పూర్తిగా ఆరాక నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. గోళ్ల రంగుని గోరు మొదలు నుంచి చివరి వరకు ఒకే యాంగిల్లో వేయాలి. మొదట కాస్త పలుచగా వేసి... అది ఆరాక మరోసారి నెయిల్‌పాలిష్ వేస్తే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. నెయిల్ పాలిష్ వేసుకున్న గోళ్లను ఐస్‌క్యూబ్స్ కరిగించిన చల్లటి నీళ్లలో ముంచాలి. అలా చేస్తే వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది. గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్‌ను ఎక్కువగా ఊపకూడదు. నెయిల్ స్టిక్కర్స్ వాడేటప్పుడు వాటిని గోరు అంచుల దాకా అంటించాలి. దాని మీద పూసే టాప్‌కోట్ నెయిల్‌పాలిష్ కూడా గోరు అంచుల వరకూ వేయాలి.