V6 News

ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

హైదరాబాద్, వెలుగు : ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్​లో ఆరు నెలలుగా కమిషనర్లు లేకపోవడంతో 12వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్​లో ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి గుర్తు చేశారు. చీఫ్ కమిషనర్​తో పాటు కమిషనర్లను వెంటనే నియమించాలని శుక్రవారం సీఎస్ శాంతి కుమారికి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. కమిషనర్లను నియమించాలని తాము హైకోర్టులో పిల్ దాఖలు చేశామని పేర్కొన్నారు. 

నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకుందని గుర్తు చేశారు. ఈ నెల 12 వరకు ఆర్టీఐ కమిషనర్ల పోస్టులకు 281 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారిని నియమించాలని కోరారు. చీఫ్ కమిషనర్​తో పాటు, కమిషనర్లుగా నియమితులయ్యేవారు అన్ని రంగాల్లో అనుభవం కలిగి ఉండేలా చూడాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించకూడదని కోరారు.