
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్అపెక్స్బ్యాంక్(టెస్కాబ్) చైర్మన్‌గా మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్ గా కొత్త కుర్మ సత్తయ్య నియమితులయ్యారు. అంతకు ముందు మార్నేని వరంగల్ డీసీసీబీ చైర్మన్ గా, కొత్తకుర్మ సత్తయ్య హైదరాబాద్ డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. టెస్కాబ్చైర్మన్గా ఇన్నాళ్లు కొనసాగిన కొండూరు రవీందర్రావు, వైస్‌చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిలు రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
వీటిని భర్తీ చేయడానికి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ సోమవారం మధ్యంతర ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.