119 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పాలక్‭ల నియామకం

119 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పాలక్‭ల నియామకం

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్లను నియమించింది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు పాలక్ సభ్యులు నెలలో 3 రోజులు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. అక్కడ పార్టీ స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లుగా వ్యవహరించనున్నారు.

బీజేపీ పాలక్లుగా నియమితులైన వారికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సూచనలు చేశారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. దేశానికి బీజేపీ తప్ప మరో పార్టీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు.

నియోజవర్గాలవారీగా పాలక్లు

జుక్కల్ - వివేక్ వెంకటస్వామి
మెదక్ - ధర్మపురి అర్వింద్
కుత్బుల్లాపూర్ - డీకే అరుణ
ఎల్లారెడ్డి - రఘునందన్ రావు
రామగుండం - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కల్వకుర్తి - రామచంద్రరావు 
వరంగల్ తూర్పు - ఈటల రాజేందర్
ములుగు - సోయం బాపూరావు
మేడ్చల్ - లక్ష్మణ్
శేరిలింగంపల్లి - కిషన్ రెడ్డి
పరిగి - విజయశాంతి
చెన్నూర్ - బోడిగె శోభ
జూబ్లీహిల్స్ - కొండా విశ్వేశ్వరరెడ్డి
కోరుట్ల - సోమారపు సత్యనారాయణ
ధర్మపురి - బాబు మోహన్
సిరిసిల్ల - రాణీ రుద్రమ రెడ్డి
హుజూరాబాద్ - ఏనుగు రవీందర్ రెడ్డి
ఆందోల్ - తుల ఉమ
పటాన్‌చెరు- మురళీధర్ రావు
మల్కాజిగిరి - ఎన్వీ సుభాష్
ముథోల్ - రచనా రెడ్డి
మహేశ్వరం - పొంగులేటి సుధాకర్ రెడ్డి
రాజేందర్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
చేవెళ్ళ - జితేందర్ రెడ్డి
కంటోన్మెంట్ - ఇంద్రసేనా రెడ్డి
ఖైరతాబాద్ - ఆచారి
నాంపల్లి - అశ్వర్థామరెడ్డి
కొడంగల్ - అందెల శ్రీరాములు 
కల్వకుర్తి - ఎం. రామచంద్ర రావు
షాద్‌నగర్ - జిట్టా బాలకృష్ణా రెడ్డి
సూర్యాపేట్ - రేవూరి ప్రకాష్ రెడ్డి
నల్లగొండ - గరికపాటి మోహనరావు
నకిరేకల్ - ఏ. చంద్రశేఖర్
పాలకుర్తి - బూర నర్సయ్య గౌడ్