జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని పబిలిసిటి సెల్ తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం ఎలక్షన్ అథారిటీ లెటర్ల కు దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనుకుంటే ఏప్రిల్ 12 వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పబ్లిసిటీ సెల్. ఇందుకుగాను, అథారిటీ లెటర్లకు దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టు మిత్రులు ఫారం 12 ను డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా నింపి సెక్రటేరియట్ మీడియా పాయింట్ పక్కన ఉన్న పబ్లిసిటీ సెల్ కార్యాలయంలో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని తెలిపింది.
పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసేవారు తమ ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్, అక్రిడేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జతపరచవలసి ఉంటుందని, అభ్యర్థులు ఆన్లైన్ ఓటర్ పోర్టల్ ద్వారా తమ ఎపిక్ నెంబర్ను సరిచూసుకొని జతపరచాలని కోరింది.ఒక సారి పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు సమర్పించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్టి దరఖాస్తు ను విత్ డ్రా చేసుకునే అవకాశం లేదని ఎలెక్షన్ అధికారులు తెలిపారు,ఈ సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే ఉంటుందని తెలిపారు అధికారులు.