ఇటాలియన్ కంపెనీ పియోజియో బ్రాండ్ ఎప్రిలియా తన ప్రీమియం మ్యాక్సీ స్కూటర్లలో ‘ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ’ రేంజ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో జీటీ 125 ధర రూ. 1.11 లక్షలు కాగా, జీటీ 175 ధర రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండు వేరియంట్లలో 14 ఇంచుల వీల్స్ ఉంటాయి. జీటీ 175 మోడల్ 174.7 సీసీ ఇంజిన్, ఏబీఎస్ ఫీచర్లతో లభిస్తుంది.
