అప్సర హత్యకేసులో..సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్

 అప్సర హత్యకేసులో..సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్

శంషాబాద్‌లో దారుణహత్యకు గురైన‌   అప్సర హత్యకేసులో నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణణు  రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా..కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో సాయి కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు సాయికృష్ణ రిమాండ్ లోనే ఉండనున్నాడు.  ఈ కేసులో  పూజారి వెంకట సాయి కృష్ణపై 302, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్సర  గర్భవతి అని నిందితుడు వెల్లడించడంతో...శవపరీక్ష నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.  అదే నిజమైతే సాయికృష్ణపై మరిన్ని సెక్షన్లు విధించే అవ‌కాశం ఉంది.

అప్సర డెడ్ బాడీకి పోస్ట్‌మార్టం ఇంకా జరగలేదు. జూన్ 9వ తేదీ నుంచి అప్సర భౌతికదేహం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ లోనే  ఉంది. పోస్ట్‌మార్టం ప్రక్రియకు ముందు అప్సర కుటుంబీకుల సంతకాలను సేకరించాల్సి ఉంది. అయితే జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నుంచి అప్సర తల్లి ఇంట్లోనే ఉంది. అప్సర తండ్రి కాశీలో ఉండటంతో తల్లిదండ్రుల  సంతకాల కోసం ఉస్మానియా వైద్యులు ఎదురు చూస్తున్నారు. జూన్ 10వ తేదీన శనివారం  తండ్రి కాశీ నుండి వస్తాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబీకులు సంతకం తీసుకున్న తర్వాత అప్సర భౌతికదేహానికి  పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. 

పోస్ట్ మార్టం రిపోర్టు కీలకం..

అప్సర హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. అప్సర గర్భవతిగా ఉన్నదని తెలిసే ఆమెను సాయికృష్ణ హత్య చేశాడని తెలుస్తోంది. అప్సర గర్భంపై  ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు  సమాచారం.  అప్సర  మొదటిసారి గర్భం దాల్చినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు. రెండోసారి కూడా అప్సర గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే నిజానిజాలు తేలుతాయని పోలీసులు ఎదురుచూస్తున్నారు. 

నిందితుడు సాయి కృష్ణ.. అప్సరను శంషాబాద్‌లో హత్య చేసి.. కారులో డెడ్ బాడీనీ సరూర్ నగర్  డంప్ చేవాడు. అక్కడ ఓ మ్యాన్ హోల్‌లో  పడేశాడు. ఈ విషయం బయటపడకుండా మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు. నిందితుడు సాయి కృష్ణను అరెస్ట్ చేసిన  పోలీసులు.. అప్సర భౌతికదేహాన్ని మ్యాన్ హోల్ నుంచి బయటకు తీశారు.  అప్సరను హత్య చేసేందుకు సాయికృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అప్సరకు ట్యాబ్లెట్స్‌ ఇచ్చి మత్తులోకి దించి..ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో వెల్లడైంది. హత్య నుంచి బయటపడేందుకు ఈనెల 5న శంషాబాద్‌ పీఎస్‌కి వెళ్లి అప్సర తన  మేనకోడలు అంటూ మిస్సింగ్‌ కంప్లైంట్‌  ఇచ్చాడు.