ఈ కానిస్టేబుల్ మాములోడు కాదు.. ఏసీబీ అధికారిని అంటూ లక్షల్లో వసూలు

ఈ  కానిస్టేబుల్ మాములోడు కాదు..  ఏసీబీ అధికారిని అంటూ లక్షల్లో వసూలు

అవినీతి నిరోధక శాఖ ఇన్ స్పెక్టర్  అంటూ  బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న  ఏఆర్ కానిస్టేబుల్ ను  ఎల్బీనగర్ ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జల్సా జీవితానికి అలవాటు పడిన నాగర్ కర్నూలు  ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్, నల్గొండకు చెందిన టీవీ మెకానిక్ రాపోలు అనిల్ కుమార్ లు  ఇద్దరు కలిసి   ఈజీ మనీ కోసం పలువురికి  ఏసీబీ అధికారులమంటూ బెదిరింపు కాల్స్ చేసి దాదాపుగా మంది నుండి 3లక్షల40వేల రూపాయలు వసూలు చేశారు.

కొత్తపేటకు చెందిన  బాధితుడు సుదీర్ బాబు పిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరిద్దరి వద్ద ద్విచక్ర వాహనం,2 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల గొర్రెల స్కామ్ లో  పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా  వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అంజనప్ప  కు బెదిరింపు కాల్స్ చేసి అతని వద్ద లక్షరూపాయలు వసూలు చేశాడు.