A.R.Rahman: క్రియేటివిటీకి చోటు లేదా? ఏఆర్ రెహమాన్ మాటలతో సినీ వర్గాల్లో కలకలం..

A.R.Rahman: క్రియేటివిటీకి చోటు లేదా? ఏఆర్ రెహమాన్ మాటలతో సినీ వర్గాల్లో కలకలం..

ఆస్కార్ విజేత, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి గల కారణాలగురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ విశ్లేషిస్తూ ‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్ట్ జరిగింది. క్రియేటివిటీ లేని వాళ్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చు. అది నేరుగా నాకు ఎదురవలేదు కానీ పుకార్ల రూపంలో వినిపించింది’ అని అన్నారు.

రెహమాన్ చేసిన ‘మత వివక్ష’ ఆరోపణలను చాలామంది తప్పుబడుతున్నారు. రెహమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇలాంటి స్టేట్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం నమ్మలేకపోతున్నానని, అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విదేశీ కాన్సర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్ద సినిమాలతో ఆయన బిజీగా ఉంటారనే ఉద్దేశ్యంతో చాలామంది నిర్మాతలు ఆయన్ను సంప్రదించలేకపోవచ్చు’ అని సీనియర్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జావేద్ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

ఒకవేళ మత వివక్ష ఉంటే కొందరు హీరోలు ఇప్పటికీ స్టార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తనకు కూడా అవకాశాలు తగ్గాయని, అంతమాత్రాన అవకాశాలు రాకపోవడానికి మతాన్ని ముడిపెట్టడం సరికాదని  సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. రెహమాన్ ‘డేంజరస్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చేశారని, వ్యక్తిగత వైఫల్యాలకు ఇండస్ట్రీని నిందించడం సరికాదని రచయిత్రి శోభా డే మండిపడ్డారు.

రెహమాన్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజకీయ చర్చకు కూడా దారితీశాయి. ఒకప్పుడు హిందువు అయిన రెహమాన్ (దిలీప్ కుమార్), తనకు మళ్లీ అవకాశాలు కావాలంటే ‘ఘర్ వాపసీ’ అవ్వాలని వీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ నేత వినోద్ బన్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇండస్ట్రీని నిందించే ముందు రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.