హాలీవుడ్ రేంజ్‌‌లో ‘ఏ మాస్టర్ పీస్’

హాలీవుడ్ రేంజ్‌‌లో ‘ఏ మాస్టర్ పీస్’

అరవింద్ కృష్ణ హీరోగా సూపర్ హీరో బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాలతో పేరు తెచ్చుకున్న సుకు పూర్వాజ్ దీనికి దర్శకుడు. శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. సూపర్ హీరో లుక్‌‌లో అరవింద్ కృష్ణ పోస్టర్‌‌‌‌ను మంగళవారం విడుదల చేశారు.

హాలీవుడ్ రేంజ్‌‌లో సరికొత్త కంటెంట్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోను మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 10 వరకు అరకులో మొదటి షెడ్యూల్, ఫిబ్రవరి 18 నుండి మార్చి 30 వరకు రెండవ షెడ్యూల్, ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 10 వరకు కులుమనాలిలో ఫైనల్ షెడ్యూల్ షూట్ జరగనుందని చెప్పారు. అరవింద్ కృష్ణతో పాటు ‘బిగ్ బాస్’ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహా గుప్త ఇతర పాత్రలు పోషిస్తున్నారు.