సుబ్బు, ప్రియాంక జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో సత్యవాణి మీసాల నిర్మించిన చిత్రం ‘దక్షిణ కాళీ’. ఇందులో హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు దర్శకుడు వి సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
హీరో సుబ్బు మాట్లాడుతూ ‘మనకు ఎందరో గ్రామ దేవతలు ఉన్నారు. వారి గొప్పదనం, మహిమ ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పాడు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ ‘అమ్మవారి మహిమలు తెలిపేలా, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో సినిమా ఆకట్టుకుంటుంది’ అని అన్నాడు.
డబ్బు కోసం కాకుండా, దక్షిణ కాళీ అమ్మవారి గొప్పదనం, మహిమలు తెలిపేందుకే నిర్మించామని నిర్మాత సత్యవాణి మీసాల అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
