
ఖైరతాబాద్, వెలుగు: రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో సత్తా చాటారు. ఖైరతాబాద్ జోన్‌లోని డాన్‌బాస్కో స్కూల్లో జరిగిన ఖోఖో అండర్–14లో బాలురు ప్రథమ బహుమతి, అండర్–17 విభాగంలో రెండో బహుమతి పొందారు. బాలికల విభాగంలో అండర్–14, 17లో ద్వితీయ బహుమతి పొందినట్టు హెచ్ఎం కరుణశ్రీ తెలి పారు. నాంపల్లిలోని శంకర్మెమోరియల్ పాఠశాలలో జరిగిన ఆర్చరీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి వైభవ్ ప్రథమ బహుమతి పొందినట్టు పేర్కొన్నారు. రాజ్‌భవన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం జాస్ అలూకాస్ నగలషాపు నిర్వాహకులు 1,43,445తో మ్యూజిక్ సిస్టమ్తోపాటు క్రీడా సామాగ్రిని అందజేశారు. గోపాల్, సునీత పాల్గొన్నారు.